Tamilnadu : టీచర్ ను కొట్టిన విద్యార్థి తల్లిదండ్రులు

Tamilnadu : టీచర్ ను కొట్టిన విద్యార్థి తల్లిదండ్రులు


స్కూల్ టీచర్ ను కొట్టారు ఓ విద్యార్థి తల్లిదండ్రులు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. తమ బిడ్డను కొట్టాడని ఆరోపించిన తల్లిదండ్రులు టీచర్ పై దాడి చేశారు. తమిళనాడు, టుటికోరిన్ జిల్లాలోని భరత్ అనే టీచర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయుడిగా పనిచేస్తున్నాడు. రెండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తల్లి సెల్వి, తండ్రి శివలింగం తమ బిడ్డను టీచర్ భరత్ కొట్టాడని స్కూలులో గొడవకు దిగారు. పిల్లలను కొట్టడం చట్టవిరుద్దమని, బిడ్డను కొట్టే హక్కు టీచర్ కు ఎవరిచ్చారని, అంటూ.. చెప్పుతో కొడతానని తల్లి సెల్వి టీచర్ భరత్ పై కొట్టడానికి వెళ్లింది.

పిల్లలు చూస్తుండగానే శివలింగం, సెల్విలు టీచర్ భరత్ పై దాడి చేశారు. స్కూల్ గ్రౌండ్ లో టీచర్ ను కొట్టారు. భార్యాభర్తలు భరత్ పై దాడి చేయడంతో మరో టీచర్ సహాయాన్ని అర్థించారు. దంపతులతోపాటు చిన్నారి తాత మునుస్వామిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. "ప్రభుత్వ ఉద్యోగిని విధులు నిర్వర్తించకుండా నిరోధించడం, నేరపూరిత కుట్ర వంటి నేరాలకుగాను వారిపై కేసులు నమోదు చేసాము" అని పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్ బాలాజీ శరవణన్ చెప్పారు.

ఏడేళ్ల చిన్నారి క్లాస్ లో ఇరత పిల్లలతో గొడవపడుతుండటంతో సీటు మార్చాల్సిందిగా ఉపాద్యాయులు ఆమెను కోరినట్లు అధికారులు పేర్కొన్నారు. సీటు మారుతున్న క్రమంలో చిన్నారి పడిపోయిందని పోలీసులు తెలిపారు. టీచర్ తనను కొట్టాడని ఇంటికెళ్లి ఫిర్యాదు చేసింది చిన్నారి.

Next Story