Tamilnadu: ఆగని అత్యాచారాలు.. 8 ఏళ్ల చిన్నారిపై ఎన్‌సిసి అధికారి దుర్మార్గం..
ఎక్కడ చూసినా కామాంధులే వీధి కుక్కల్లా స్వైర విహారం చేస్తున్నారు. పసి పాపను చూసినా తనలో ఉన్న పశువాంఛ నిద్ర లేపుతున్నారు. ఒక పక్క కోల్ కతా హత్యాచార ఘటనకు దేశం వణికిపోతుంటే మరో పక్క నీచ నికృష్ట వ్యక్తులు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అమాయకపు చిన్నారులను సైతం తమ కామవాంఛకు బలిచేస్తున్నారు. చదివిన చదువులు, అధికార హోదాలు అన్నీ గాలికి వదిలేసి క్షణిక సుఖం కోసం ఆడబిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ అరాచకాలకు ముగింపు పలికేందుకు ఏ చట్టాలు పనిచేస్తాయి.. ఏ ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి.
తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో 8వ తరగతి విద్యార్థినిపై ఎన్‌సిసి అధికారి అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే తమపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్‌తో పాటు మరో ఐదుగురిని బర్గూర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి కటకటాల వెనక్కు పంపించారు.
ఆగస్ట్ 5 నుండి 9 వరకు జరిగిన ఎన్‌సిసి క్యాంప్‌లో ఆగస్టు 8 న ఈ సంఘటన జరిగింది. ఇందులో 13 ఏళ్ల బాలిక 16 మంది విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. మహిళా పార్టిసిపెంట్స్ అందరూ స్కూల్ లోనే ఉండి ఆడిటోరియంలో పడుకున్నారు.
శివరామన్ అనే 30 ఏళ్ల ఎన్‌సిసి అధికారి బాలికను బయటికి రప్పించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ప్రిన్సిపల్ సతీష్ కుమార్‌తో ఆమె తనపై జరిగిన అత్యాచార ఘటనను వివరించగా, అతను మౌనంగా ఉండమని ఆమెను కోరాడు. శిబిరం ముగిసిన తర్వాత, అమ్మాయి ఇంటికి తిరిగి వచ్చింది, అయితే ఆగస్టు 16 నాటికి ఆమె ఆరోగ్యం క్షీణించింది. దాంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ తనపై అత్యాచారం జరిగిన విషయం వైద్యులకు తెలిపింది. శిబిరంలోని ఇతర బాలికలను కూడా శివరామన్ లైంగికంగా వేధించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
నామ్ తమిజార్ కట్చి (ఎన్‌టికె) యువజన విభాగం కృష్ణగిరి తూర్పు జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న శివరామన్‌ను ఎన్‌టికె చీఫ్ సీమాన్ పార్టీ నుండి బహిష్కరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com