బాలికపై మైనర్ల అత్యాచారం

బాలికపై మైనర్ల అత్యాచారం
11 ఏళ్ల బాలికపై టీనేజర్ల అత్యాచారం.... దారుణానికి తెగబడ్డ 13, 14 ఏళ్ల బాలురు.. బాలిక తల్లి ఆస్పత్రిలో ఉన్న సమయంలో దారుణం.

దేశంలో అత్యాచారాలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనలు నమోదవుతున్నాయి. ఇలాంటి దారుణ ఘటనల్లో బంధువులే ఎక్కువమంది నిందితులుగా మారుతున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో ఇలాంటి దారుణమే వెలుగుచూసింది. 11 ఏళ్ల బాలికపై..13, 14 ఏళ్ల మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. తల్లి ఆసుపత్రిలో ఉన్న సమయంలో బాలిక తన బంధువుల వద్ద ఉన్న సమయంలో ఇద్దరు బాలురు ఈ దారుణానికి ఒడిగట్టారు. జూన్ 15న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆరా తీసిన ఆమె అక్క.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచారు.

Tags

Read MoreRead Less
Next Story