Telangana: మానుకొండూరులో కాల్పుల కలకలం

కరీంనగర్ జిల్లా మానుకొండూరులో కాల్పుల కలకలం రేపింది. పీడీ యాక్ట్ నమోదైన అరుణ్ అనే వ్యక్తిపై అర్ధరాత్రి దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దుండగుల నుంచి తప్పించుకునేందుకు అరుణ్ ప్రయత్నం చేశారు. అయినా వదలని గుర్తు తెలియని వ్యక్తులు.. అరుణ్‌ను పట్టుకుని చితకబాదారు. దాంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఒకరిని అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అరుణ్‌పై దుండగుల కాల్పులకు కారణాలు తెలియాల్సి ఉందని.. దర్యాప్తు చేసి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ముగ్గురు వచ్చి ఒకతనుపై దాడి చేశారని ప్రత్యక్ష సాక్ష్యలు తెలిపారు. ఇద్దరు కొడుతున్నారని.. ఒకరు గన్‌తో షూట్ చేస్తున్నారని చెప్పారు. కాల్పుల్లో తమకు గాయమైందని.. తర్వాత తమను చూసి నిందితులు పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com