Telangana High Court : రాజు ఆత్మహత్యపై విచారణ: 4 వారాలు గడువిచ్చిన తెలంగాణ హైకోర్టు..!

సైదాబాద్ నిందితుడు రాజు మృతిపై జ్యూడీషియల్ విచారణకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. విచారణ జరిపి నాలుగు వారాల్లో సీల్టు కవర్‌లో నివేదిక సమర్పించాలని వరంగల్ మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది. రాజు మృతిపై పౌర హక్కుల సంఘం నేత దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. రాజును పోలీసులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదించారు. దీనిపై అభ్యంతరం తెలిపిన అడ్వకేట్ జనరల్.. రాజు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఏడుగురి సాక్ష్యాల నమోదు ప్రక్రియ, మృతదేహం పోస్టుమార్టం వీడియో చిత్రీకరణ కూడా జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అడ్వకేట్ జనరల్. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. పోస్టుమార్టం వీడియోలను రేపు రాత్రి 8 గంటల్లోపు వరంగల్ జిల్లా జడ్జికి సమర్పించాలని సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com