ప్రియురాలు మోసం చేసిందని కెనడాలో సూసైడ్ చేసుకున్న ప్రణయ్.. అనంతపురం చేరుకున్న మృతదేహం

ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందన్న బాధతో సూసైడ్ చేసుకున్న ప్రయణ్ మృతదేహం అనంతపురం చేరుకుంది. కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులు చివరికి ఇలా విగతజీవిగా చూస్తామనుకోలేదంటూ భౌతికకాయాన్ని చూసి కన్నీరు ఆపుకోలేకపోయారు. కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో అక్కడంతా విషాదవాతావరణం నెలకొంది. ఈ కేసుపై పూర్తి విచారణ చేసి, తమ బిడ్డ చావుకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అటు, అమర ప్రేమికుడికి కన్నీటి నివాళి అంటూ స్నేహితులంతా బ్యానర్‌లు కట్టి నివాళులు తెలిపారు.
కెనడాలో ఉంటున్న ప్రణయ్ ఈనెల 14న నైట్రోజన్ గ్యాస్ పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నమ్మకద్రోహం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకున్నాడు. సూసైడ్‌కి కొద్ది రోజుల ముందు నుంచి ప్రయణ్, ఆ అమ్మాయిని ఒప్పించడానికి, ఆమె కుటుంబ సభ్యులకు నచ్చచెప్పడానికి చాలా ప్రయత్నించాడు. ఆ ఆడియో రికార్డింగ్‌లను కూడా ప్రణయ్ యూట్యూబ్‌లో పెట్టాడు. అఖిల తనలాగే మరికొందరిని కూడా మోసం చేసిందని, అవన్నీ తెలిసినా తాను ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డా తనకు చెప్పాపెట్టకుండా US వెళ్లిపోయిందని వివరించాడు. తనలా ఇంకెవరూ మోస పోకూడదనే ఆమె ఆడిన డ్రామాల్ని బయటపెట్టేందుకు ఈ వీడియో చేసినట్టు చెప్పాడు. తర్వాత నైట్రోజన్ గ్యాస్ పీల్చి సూసైడ్ చేసుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com