Terror Alert: యోగా క్లాస్ పేరిట టెర్రర్ ట్రైనింగ్; 11మందిపై NIA ఛార్జ్ షీట్

Hyderabad
Terror Alert: యోగా క్లాస్ పేరిట టెర్రర్ ట్రైనింగ్; 11మందిపై NIA ఛార్జ్ షీట్
నగరంలో తీవ్రవాద కార్యకలాపాలు; 11మందిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జ్ షీట్ ; కలకలం సృష్టిస్తున్న అరెస్ట్ లు...

Terror Alert: నగరంలో టెర్రర్ కలకలం; 11మందిపై NIA ఛార్జ్ షీట్...


తీవ్రవాద ఉనికితో నగరం మరోసారి ఉలిక్కిపడింది. నిషేధానికి గురైన ఇస్లామిక్ సంస్థ పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థలో యువతను చేర్చేందుకు టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్స్ పేరిట తరగతులు నిర్వహిస్తున్న 11 మంది పై NIA అధికారులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఇందులో పది మంది తెలంగాణాకు చెందిన వారు కాగా, ఒకరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.


దీనికి సంబంధించిన తొలికేసు నిజామాబాద్ లోని 4టౌన్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అవ్వగా, తిరిగి ఆగస్ట్ 26న ఎన్ఐఏ అధికారులు రీ-రిజిస్టర్ చేశారు. ఈ మేరకు విచారణ ప్రారంభించిన సంస్థ తాజాగా 11మంది పై ఛార్జ్ షీట్ ధాఖలు చేసింది.


ఈ మేరకు వివరాలు వెల్లడించిన ఎన్ఐఏ అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్లాం యువతకు బ్రెయిన్ వాష్ చేస్తూ పీఎఫ్ఐలో చేర్చుతున్నారి వెల్లడించారు. యెగా క్లాసులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ముసుగులో ఎంపికైన యువతకు మనిషిని చంపడంలో తర్ఫీదు ఇస్తున్నారన్న విషయాలు విచారణలో వెలుగులోకి వచ్చారని అధికారులు తెలిపారు.


ఇక తాము అదుపులోకి తీసుకున్న నిందితులను తెలంగాణాకు చెందిన అబ్దుల్ ఖదీర్, అబ్దుల్ ఆహద్, అబ్దుల్ సలీమ్, షేక్ షాదుల్లా, ఫెరోజ్ ఖాన్, మహమ్మద్ ఓస్మాన్, సయ్యద్ యహియా సమీర్, షేక్ ఇమ్రాన్ అలియాస్ ఇమ్రాన్ ఖురేషీ, మహమ్మద్ అబ్దుల్ ముబీన్, మహమ్మద్ ఇర్ఫాన్ తోపాటూ ఇక ఆంధ్రప్రదేశ్ కు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్ గా గుర్తించినట్లు వెల్లడించారు.


Tags

Next Story