Manipur: రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. సైనికులపై దాడి.. ఏడుగురు మృతి..

Manipur (tv5news.in)

Manipur (tv5news.in)

Manipur: మణిపూర్ చురా చంద్ పూర్ లో జిల్లా సింఘత్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.

Manipur: మణిపూర్ చురా చంద్ పూర్ లో జిల్లా సింఘత్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అస్సోం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కాన్వాయ్ లక్ష్యంగా మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో అస్సాం రైఫిల్స్ కు నలుగురు సైనికులు, ఒక కమాండింగ్ ఆఫీసర్, అతని భార్య, 8 ఏళ్ల చిన్నారి సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.

ఉదయం 10 గంటల టైంలో ఈ దాడి జరిగింది. కల్నల్ విజయ్ త్రిపాతి మరో క్యాంప్‌కు వెళ్లి తిరిగివస్తుండగా కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఈ దాడి వెనుక మణిపూర్ కు చెంది లిబరేషన్ ఆర్మీ, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఉగ్రసంస్థల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతం చాలా మారుమూల ప్రాంతమన్నారు పోలీసులు. ఘటనా స్థలం చురాచంద్‌పూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని చెప్పారు. గాయపడిన వారిని సమీప హాస్పిటల్ కు తరలించామన్నారు.

దాడి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్. దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. దేశం ఐదుగురు ధైర్యవంతులైన సైనికులు సహా అస్సాం రైఫిల్స్ కమాండర్ ఆఫీసర్ ను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ కూడా దాడిని ఖండించారు. పోలీసులు, పారామిలిటరి సిబ్బంది దాడికి కారణమైన వారిని వెతుకుతున్నారని ట్వీట్ చేశారు. దాడి ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం విచారం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story