హనీమూన్ కు వెళ్లిన దంపతులు ఫోటోషూట్ చేస్తూ తిరిగిరాని లోకాలకు..

హనీమూన్ కు వెళ్లిన దంపతులు ఫోటోషూట్ చేస్తూ తిరిగిరాని లోకాలకు..
పెళ్లై పదిహేను రోజులు కూడా కాలేదు.. అప్పుడే ఆయుష్షు తీరిపోయింది. హనీమూన్ కు వెళ్లి అక్కడే తనువు చాలించారు.

పెళ్లై పదిహేను రోజులు కూడా కాలేదు.. అప్పుడే ఆయుష్షు తీరిపోయింది. హనీమూన్ కు వెళ్లి అక్కడే తనువు చాలించారు. చెన్నైకి చెందిన డాక్టర్లు లోకేశ్వరన్, విభూష్నియా జూన్ 1న వివాహం చేసుకున్నారు. దంపతులు తమ హనీమూన్ కోసం బాలి వెళ్లారు. అక్కడి అందాలను ఆస్వాదించేందుకు స్పీడ్‌ బోట్‌ రైడ్‌ చేస్తూ ఫోటోషూట్‌లో మునిగిపోయారు. ఈ క్రమంలో పడవ బోల్తా పడటంతో దంపతులిద్దరూ నీటిలో పడిపోయారు. రెస్క్యూ టీమ్ అప్రమత్తమైన వారిని కాపాడలేకపోయారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న విబుష్నియా తండ్రి సెల్వం, బంధువులు ఇండోనేషియా వెళ్లారు.

దంపతులిద్దరూ స్పీడ్‌ బోట్‌ రైడ్‌ ప్లాన్‌ చేసుకున్నారని, పడవ బోల్తా పడటంతో విషాదకరంగా మారి సముద్రంలోకి లాగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటనకు దారితీసిన ఖచ్చితమైన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతదేహాలను చెన్నైకి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండోనేషియాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా సహాయం కోరారు. ఇండోనేషియా నుంచి చెన్నైకి నేరుగా విమానాలు లేకపోవడంతో మృతదేహాలను తమిళనాడుకు తీసుకురావడానికి ముందే మలేషియాకు తరలించనున్నారు.

ఈ ఘటనతో విబుష్నియా కుటుంబం నివాసం ఉంటున్న సెన్నెర్‌కుప్పం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లికి వెళ్లలేని వారు కొత్త జంట హనీమూన్ నుంచి వచ్చిన తరువాత కలుద్దామనుకున్నారు. అంతలోని ఇంతటి విషాదం చోటు చేసుకుందని వాపోతున్నారు. నూతన వధూవరుల అకాల మరణం బంధువుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Tags

Read MoreRead Less
Next Story