బుద్ధిలేని కొడుకు.. ఆస్తికోసం తండ్రిని కొట్టి కొట్టి చంపేశాడు..

కనిపెంచిన తల్లిదండ్రులన్న కనికరం లేకుండా ప్రవర్తిస్తుంటారు కొందరు దుర్మార్గపు కొడుకులు. ఎన్నో కష్టనష్టాల కోర్చి పిల్లలను పెంచి పెద్ద చేసి వాళ్లకొక జీవితాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత లేకపోగా ఆస్థి కోసం వారిని చంపేందుకు అయినా వెనుకాడ్డం లేదు. ఓ దురదృష్టకర సంఘటన చెన్నైలో చోటు చేసుకుంది.
తమిళనాడులోని పెరంబలూర్‌లో 65 ఏళ్ల వ్యక్తి కుటుంబ ఆస్తిని పంచుకోవడంపై అసంతృప్తితో ఉన్న తన కొడుకు కొట్టడంతో మరణించాడు. కులంధైవేలు అనే వ్యక్తి ఏప్రిల్ 18న తన కొడుకు సంతోష్ దాడికి గురైన కొద్ది రోజులకే మరణించాడు.
దర్యాప్తులో బయటపడిన సీసీటీవీ ఫుటేజీలో సంతోష్ తన తండ్రి ముఖంపై పదే పదే కొట్టడం, రక్తపుమడుగులో పడి కుప్పకూలినట్లు చూపిస్తుంది. దాడిని చూసిన ఇతర కుటుంబ సభ్యులు సంతోష్‌ను అడ్డుకున్నారు. కోపంతో ఉన్న సంతోష్ దాడిని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించాడు.
ఓ ప్రైవేట్ కంపెనీ యజమాని కులందైవేలు మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 324 (స్వచ్ఛందంగా ప్రమాదకరమైన మార్గాల ద్వారా గాయపరచడం), మరియు 506 (నేరపూరిత బెదిరింపు) కింద సంతోష్‌పై కేసు నమోదు చేయబడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com