ఇంటి యజమాని పాడుబుద్ధి.. అద్దెకిచ్చిన గదిలో రహస్యంగా..

కొందరు పేరుకు మాత్రమే పెద్దవాళ్లు. కానీ వాళ్ల బుద్దులు మాత్రం అథం:పాతాళంలోనే ఉంటాయి. వయసు పెరిగినా వంట్లో ఉన్న అవలక్షణాలు మాత్రం పోవు.. తనకీ భార్యా పిల్లలు ఉన్నారన్న ఇంగితజ్ఞానం మరిచిపోయి ప్రవర్తిస్తుంటారు. చదువుల నిమిత్తంగానో, ఉద్యోగాల నిమిత్తంగానో పట్నం వచ్చి అద్దెకు గది తీసుకుని ఉన్న యువతుల గదిలో రహస్య కెమెరా అమర్చాడో ప్రబుద్ధుడు. తన గదిలోని సెల్ ఫోనుకు అనుసంధానం చేసుకున్నాడు.
గదిలో వారి చర్యలను వీక్షించే వాడు.. యూసఫ్ గూడ సమీపంలోని వెంకటగిరి హైలం కాలనీలో అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ యువతి, తన సోదరుడు, స్నేహితురాలితో కలిసి ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇంటి యజమాని సయ్యద్ సలీమ్ యువతులపై కన్నేశాడు. వారి రాకపోకల్ని గమనించేవాడు.. విద్యుత్ మీటర్ పేరిట యువతులు ఉంటున్న గదిలో ఓ రహస్య కెమెరాను ఉంచాడు. గదిలోని దృశ్యాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు సెల్ ఫోన్ లో యాప్ వేసుకున్నాడు.
ఇందుకోసం రెండు ప్రత్యేక డిజిటల్ వీడియో రికార్డర్ లు ఏర్పాటు చేసుకుని ఒక దానిని యువతుల గదికి అనుసంధానించాడు. డబ్బాపై అనుమానం వచ్చిన యువతులు తెరిచి చూసారు. దాంట్లో కెమెరా ఉన్న విషయం తెలుసుకుని ఇంటి యజమానిని నిలదీశారు. అనంతరం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సయ్యద్ సలీమ్ ను విచారిస్తున్నారు. అతడి వద్ద నుంచి సెల్ ఫోన్, కెమెరా, డీవీఆర్ అను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com