మెట్రో స్టేషన్ నుండి దూకిన మహిళ విషాద జీవితం..

అక్షరధామ్ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రత్నించిన అమ్మాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన 25 ఏళ్ల అమ్మాయి చెవిటి మరియు మూగ. హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఆమె ఇటీవలే ఉద్యోగం మానేసింది.
తూర్పు ఢిల్లీలోని బ్లూ లైన్‌లోని అక్షరధామ్ మెట్రో స్టేషన్‌లోని 40 అడుగుల ఎత్తున్న ప్లాట్‌ఫారమ్‌పై నుంచి దూకిన ఆ అమ్మాయి శుక్రవారం లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) సిబ్బంది ఆమెను ఆత్మహత్యా ప్రయత్నం నుంచి తప్పించడానికి శతవిధాల ప్రయత్నించారు. మాటల ద్వారా మభ్యపెట్టి ఆమె ప్రయత్నాన్ని విరమింపజేయాలనుకున్నా పోలీసులతో మాట్లాడుతూనే దూకేసింది.
ఈలోపు ఎందుకైనా మంచిదని కింద బ్లాంకెట్లు పట్టుకుని కొందరు వ్యక్తులు నిలబడ్డారు. ఒకవేళ దూకినా బ్లాంకెట్ లోనే పడుతుంది.. అమ్మాయికి ప్రాణాపాయం తప్పుతుంది అనుకున్నారు.. కానీ 40 అడుగుల నుంచి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వైద్యం అందించినా ఉపయోగం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది.
ఆమె జీవితంలోని కష్టాలు, బాధలు ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పాయి. తల్లిదండ్రులు ఆమె చిన్నప్పుడే చనిపోయారు.. వాళ్లు కూడా మూగ చెవిటి వారు. బామ్మ దగ్గర ఉంటోంది.. ఆమెకు కూడా వయసు అయిపోతోంది.. తను కూడా మరణిస్తే ఒంటరి జీవితం గడపాల్సి వస్తుంది అని కలత చెందింది.. డిప్రెషన్ తో బాధపడుతూ చేస్తున్న ఉద్యోగాన్ని కూడా మానేసింది. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com