హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం..

ఆదివారం అర్థరాత్రి హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. రైలులో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లోనూ దోపిడీకి విఫలయత్నం చేశారు. పోలీసులకు సమాచారం అదడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. దాంతో దొంగలు పారిపోయారు.
రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా ఉలవపాడు-తెట్టు రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను ఉలవపాడు పరిధిలోని సుబ్బరాయుడు సత్రం గేటు వద్ద ఆరుగురు దుండగులు నిలిపివేశారు. అనంతరం దొంగలు రైలులోని ఎస్ -1, ఎస్-2, ఎస్-3 బోగీల్లోకి ప్రవేశించి మహిళల వద్ద ఉన్న బంగారాన్ని చోరీ చేశారు. అనంతరం తెట్టు సమీపంలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి పాల్పడుతుండగా, పోలీసులు అప్రమత్తమై వారిని ఎదుర్కొన్నారు. దీంతో దొంగలు వారిపై రాళ్లు రువ్వి పారిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com