Medchal : ఇంట్లో దొంగల చొరబాటు.. ఆధారాలు లభించకుండా కారం చల్లి పరారీ..

Medchal : ఇంట్లో దొంగల చొరబాటు.. ఆధారాలు లభించకుండా కారం చల్లి పరారీ..
X
Medchal : మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీర్ బాగ్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు.

Medchal : మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీర్ బాగ్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లోకి చొరబడి దోపిడీ చేయడమే కాకుండా.. ఇంటికి నిప్పుపెట్టారు. ఖుత్బుల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రెసిడెన్సీ కాలనీలో ఉంటున్న బంగార్ రెడ్డి...తన తండ్రి సంవత్సరికానికి దిల్ సుఖ్ నగర్ లోని సోదరుడి ఇంటికి వెళ్లాడు. ఎవరూలేని సమయంలో ఇంట్లోకి చొరబడిన దోపిడీదొంగలు.. 80వేల నగదు దొంగిలించారు. అనంతరం ఆధారాలు లభించకుండా ఇంట్లో కారం చల్లారు. అనంతరం ఇంటికి నిప్పుపెట్టి పరారయ్యారు. ఇంట్లో రక్తపు మరకలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. దొంగలకు గాయాలు అయ్యాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story