Jaipur: వెండి కడియాల కోసం కాళ్లు నరికేశారు.. ఆపై..

Jaipur (tv5news.in)
Jaipur: దొంగలు ఈ మధ్య డబ్బు కోసం ఎంత దారుణానికి అయినా ఒడిగడుతున్నారు. డబ్బు కోసం మనుషులను చంపడానికి అయినా వెనకాడట్లేదు. ఇటీవల వెండి కడియాల కోసం ఓ మహిళ కాళ్లు నరికేసారు దొంగలు. ఇది విన్న ఊరివారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పైగా ఇలాంటి ఘటన జరగడం ఇటీవల కాలంలో రెండోసారి.
జైపూర్‌లోని చార్‌భుజా పోలీస్‌స్టేషన్ పరిధిలో కంకుబాయి తన భర్త, పిల్లలతో కలిసి నివసిస్తుంది. అయితే పొలం పనులకు వెళ్లిన భర్తకు భోజనం తీసుకెళ్లేందుకు తాను ఉదయమే పొలానికి బయలుదేరింది. కానీ తాను పొలానికి వెళ్లలేదు. ఇది తెలియన కంకుబాయి భర్త ఎప్పటిలాగానే ఇంటికి వచ్చి పిల్లలను తన గురించి అడిగాడు. అప్పుడు కంకుబాయి పొద్దున్నే పొలం దగ్గరకి బయల్దేరిందని తెలిపారు.
కంకుబాయి భర్త, కుటుంబ సభ్యులు అందరు కలిసి రాత్రి వరకు తాను ఎక్కడికి వెళ్లిందా అని వెతికారు. అయినా లాభం లేకపోవడంతో చార్‌భుజా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఓ వ్యవసాయ పొలం వద్ద కంకుభాయి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తన శవం పాదాల వరకు నరికేసి ఉండడం వారు గమనించారు.
అయితే వెండి కడియాల కోసమే ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్దారణకు వచ్చారు. దొంగలించే క్రమంలో మెడపై కూడా దాడి చేయడంతో ఆమె మరణించినట్లు పేర్కొన్నారు. అదే ప్రాంతంలో కొద్దిరోజుల క్రితం పొలం పనులకు వెళ్లిన మహిళ కూడా ఇలాగే శవమై కనిపించింది. దీంతో ఒకరే ఈ హత్యలకు పాల్పడుతున్నారేమో అని పోలీసులు అనుమానిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com