CRIME: అమ్మే అసలు విలన్

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ లో ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసును పోలీసులు చేధించారు. కన్న తల్లి రజిత కర్కషంగా ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టి చంపిందని తెలిపారు. భర్తను కూడా చంపాలని చూసినా ఆరోజు అతడు పెరుగున్నం తినకపోటవంతో బతికి బట్టకట్టాడని పోలీసులు వెల్లడించారు. తాను కూడా విషం కలిపిన భోజనం చేసి రజితకు అస్వస్థతకు గురైనట్టు నాటకం ఆడిందని పోలీసులు తేల్చారు. విచారణలో నిజం బయటపడటంతో తల్లి రజితను అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల క్రితం రజిత పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లింది. అక్కడ ఓ స్నేహితుడితో పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ సంబంధానికి పిల్లలు, భర్త అడ్డొస్తున్నారనే చంపాలని ప్లాన్ చేసింది. పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టి తినిపించడంతో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. 12 ఏళ్ల సాయికృష్ణ, 10 ఏళ్ల మధు ప్రియ, 8 ఏళ్ల గౌతమ్ మృతితో తీవ్ర విషాదం నెలకొంది. రజితతోపాటు ఆమె ప్రియుడూ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. వివాహేతర సంబంధం మోజులో పడి కడుపున పుట్టిన బిడ్డలను చంపుకోవటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com