శిల్పాచౌదరి కేసులో ముగిసిన మూడు రోజుల కస్టడీ

కిట్టీ పార్టీల పేరుతో సెలబ్రిటీల వద్ద కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో అరెస్టైన శిల్పా చౌదరి పోలీసు కస్టడీ ముగిసింది. మూడు రోజులుగా కస్టడీలో పోలీసులకు సహకరించకుండా ముప్పతిప్పలు పెట్టింది శిల్పా చౌదరి. ఈ మూడ్రోజులు ఆమె నోరు మెదపలేదంటున్నారు పోలీసులు. శిల్పా ఇప్పటి వరకు 32 కోట్ల రూపాయలు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె చేసిన అప్పులకు సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు.... బాధితుల స్టేట్‌మెంట్ల ఆధారాలు చూపించినా.... తాను నిర్దోషినంటూ పోలీసులతో వాదనకు దిగుతోంది.
మరోవైపు... శిల్పా ఖాతాలో కేవలం రూ. 16 వేలు, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఖాతాలో రూ. 14 వేలు మాత్రమే గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం మూడు కేసుల్లో రూ. 7 కోట్లు మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అయితే... ఈ 7 కోట్లు తిరిగి ఇచ్చేస్తాననంటోంది శిల్పాచౌదరి. అల్లోల దివ్యారెడ్డి, సినీనటి ప్రియదర్శినికి రూ. 3 కోట్లకుపైగా ఎగవేసింది శిల్పా చౌదరి. ఇక... రాధిక రెడ్డికి రూ.10 కోట్లకు పైగా డబ్బులు ఇచ్చినట్లు చెబుతోన్న శిల్పా .... దీనికి సంబంధించిన ఆధారాలు మాత్రం సమర్పించలేదు.
అమెరికాలో మూడేళ్ల పాటు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసిన శిల్పా చౌదరి..... ఇండియాకు తిరిగి వచ్చి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. కేవలం సంపన్నులనే టార్గట్ చేసిందంటున్నారు పోలీసులు. కస్టడీ ముగియడంతో .... రేపు ఉదయం 11 గంటలకు ఆమెను ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు పోలీసులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com