క్రైమ్

బెంగళూరులో భారీ పేలుడు..

బెంగళూరులోని చామరాజుపేటలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ భవనంలో భారీ పేలుడు సంభవించింది. ముగ్గురు మరణించారు.

బెంగళూరులో భారీ పేలుడు..
X

బెంగళూరులోని చామరాజుపేటలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ భవనంలో భారీ పేలుడు సంభవించింది. ముగ్గురు మరణించగా... మరికొందరికి గాయాలయ్యాయి. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అక్కడివారంతా భయంతో పరుగులు తీశారు. పేలుడుధాటికి మృతదేహాలు చెల్లాచెదురుకావడంతో ఆ ప్రాంతం విధ్వంసకరంగా మారింది. భవనం పక్కనే ఉన్న పంక్చర్‌ షాపు కూడా ధ్వంసమైంది. వి.వి.పురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందిస్తున్నారు. గ్యాస్ పేలుడా లేక.. బాణా సంచా పేలుడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES