తల్లి మందలించిందని అక్కచెల్లెళ్లు ముగ్గురూ..

కనిపెంచిన తల్లిదండ్రులకు కన్నబిడ్డలను దండించే హక్కు ఉంటుంది. తప్పు చేస్తే మందలిస్తారు. అదే బిడ్డలకి ఏదైనా వస్తే తల్లడిల్లిపోతారు. అలాంటిది అమ్మ ఒక్క మాట అన్నా పడడానికి సిద్ధంగా లేరు నేటి పిల్లలు. అమ్మ.. అక్కని అరిచిందని ముగ్గురూ రాత్రి పడుకునే ముందు ఏం ప్లాన్ వేశారో.. తెల్లారిపాటికి పక్కమీద లేరు. ఎదిగిన ఆడపిల్లలు ఎక్కడికి వెళ్లారో అని తల్లి తల్లడిల్లిపోతోంది.
హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నివసిస్తున్న ముగ్గురు బాలికలు అదృశ్యమవడం కలకలం రేపింది. తుర్కయాంజిల్‌లోని ప్రగతినగర్‌లో 14,15,17 ఏళ్లు ఉంటే ముగ్గురు బాలికలు తమ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. శుక్రవారం రాత్రి తల్లి పెద్ద కుమార్తెను మందలించింది.
ఈ క్రమంలోనే తల్లి, ముగ్గురు కుమార్తెల మధ్య చిన్న వివాదం చోటు చేసుకుంది. ఆ రోజు రాత్రి ముగ్గురు అక్క చెల్లెళ్లు కలిసి ఏం మాట్లాడుకున్నారో తెల్లారి శనివారం నిద్ర లేచి చూసిన తల్లికి ముగ్గురు కుమార్తెలు కనిపించలేదు. దీంతో కంగారు పడ్డ తల్లి చుట్టుపక్కల విచారించింది.
ఎక్కడ వెతికినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబసభ్యులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com