Panaji: ఆ ఇన్‌ కం ట్యాక్స్ అధికారులకు.. ఇదేం పాడు బుద్ది

Panaji: ఆ ఇన్‌ కం ట్యాక్స్ అధికారులకు.. ఇదేం పాడు బుద్ది
X
Panaji: కేసును మరింత దర్యాప్తు చేసి నిందితులను ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందని పాలేకర్ తెలిపారు.

Paanaji: చదువులు, హోదాలు ఏవీ గుర్తుకు రావు.. మహిళను చూస్తే అన్నీ మర్చిపోతారు.. పరువు, మర్యాద అన్నీ పక్కనే. వెకిలి చేష్టలు వేయడం, కోర్కెలు తీర్చుకోవడం ఇదే ప్రధాన ధ్యేయంగా మారుతోంది కొందరు పురుషులకి. ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్లై ఉండి ఛీప్ గా ప్రవర్తించారు.

గోవాలోని పనాజీలోని కార్యాలయానికి అనుబంధంగా ఉన్న ముగ్గురు ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు మహిళా సబార్డినేట్ సిబ్బందిపై లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

ఢిల్లీకి చెందిన ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు మనీందర్ అత్రి, రాజస్థాన్‌కు చెందిన ఆదిత్య వర్మ, బెంగళూరుకు చెందిన దీపక్ కుమార్‌లపై గురువారం కేసు నమోదు చేసినట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ నిఖిల్ పాల్యేకర్ తెలిపారు.

"ముగ్గురు నిందితులపై IPC సెక్షన్ 354 (A), 354 (D), 509, 506 (II) rw 34 కింద కేసు నమోదు చేయబడింది. కేసును మరింత దర్యాప్తు చేసి నిందితులను ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందని పాలేకర్ తెలిపారు.

ఫిబ్రవరి 2022 నుంచి నిందితులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులలో ఇద్దరు బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆమె మొబైల్ నుండి వాట్సాప్ సందేశాలు, ఇతర అంశాలను తొలగించాలని బెదిరించారు. కాగా, మూడో నిందితుడు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సహకరించనందుకు నిరసన వ్యక్తం చేశాడు.

పనాజీ పోలీసులు ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం నుంచి సీసీటీవీ ఫుటేజీని కోరింది. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. ఇప్పటి వరకు ఒకే ఒక మహిళ నుంచి ఫిర్యాదు అందిందని తెలిపారు. "అయితే ఇతర మహిళా సిబ్బందికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందేమో విచారించి దర్యాప్తును వేగవంతం చేస్తామని పోలీసులు తెలిపారు.

Tags

Next Story