పాపం పసివాడు.. తండ్రి కొట్టిన దెబ్బలకు మూడేళ్ల బాలుడు

పాపం పసివాడు.. తండ్రి కొట్టిన దెబ్బలకు మూడేళ్ల బాలుడు
ఇంట్లో నుంచి బయటికి వచ్చి రోడ్డుపై ఆటలాడినందుకు తండ్రి దారుణంగా శిక్షించడంతో మూడేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

ఇంట్లో నుంచి బయటికి వచ్చి రోడ్డుపై ఆటలాడినందుకు తండ్రి దారుణంగా శిక్షించడంతో మూడేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

నాన్నకి ఎందుకు అంత కోపం వచ్చిందో.. రోడ్డు మీద ఆటలేంటని ఇంట్లోకి ఈడ్చుకొచ్చి పసివాడని కూడా చూడకుండా చావు దెబ్బలు కొట్టాడు. దాంతో ఆ చిన్నారి స్పృహ తప్పి పడిపోయాడు. అదే సమయానికి ఇంటికి వచ్చిన తల్లి చిన్నారి అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించింది. హుటాహుటిన బాలుడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే చిన్నారి చనిపోయినట్లు నిర్ధారించారు.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన లత, శివ దంపతులు రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం గ్రామంలో నివసిస్తున్నారు. వీరికి మూడేళ్ల బాలుడు సంజు ఉన్నాడు. బుధవారం సాయంత్రం శివ ఏదో పని చేస్తుండగా సంజు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఆటలాడుతూ రోడ్డుపై పరుగెత్తడం ప్రారంభించాడు. దీంతో శివ పిల్లవాడిని పట్టుకుని రోడ్డు మీదకు వెళ్లొద్దని ఎన్ని సార్లు చెప్పాలని కసురుకున్నాడు.. ఇంట్లోకి లాక్కొచ్చి కొట్టడంతో పిల్లవాడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న మహేశ్వరం పోలీసులు శివపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story