Crime News: కన్నతల్లి కర్కశత్వం.. మూడేళ్ల బిడ్డని బతికుండగానే పాతిపెట్టి..

Crime News: కన్నతల్లి కర్కశత్వం.. మూడేళ్ల బిడ్డని బతికుండగానే పాతిపెట్టి..
Crime News: కనిపెంచిన బిడ్డ కాసేపు కనింపించకపోతేనే కన్నతల్లి తల్లడిల్లుతుంది.. అలాంటిది తన చేతులతో తానే ఆ బిడ్డని బతికుండగానే పూడ్చిపెట్టింది.

Crime News: కనిపెంచిన బిడ్డ కాసేపు కనింపించకపోతేనే కన్నతల్లి తల్లడిల్లుతుంది.. అలాంటిది తన చేతులతో తానే ఆ బిడ్డని బతికుండగానే పూడ్చిపెట్టింది. అమ్మతనానికే కళంకం తెచ్చిన ఈ సంఘటన బీహార్‌లోని సరన్ జిల్లాజిల్లాలోని కోపా పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్హా నది ఒడ్డున ఉన్న శ్మశాన వాటికలో ఈ ఘటన చోటుచేసుకుంది.

తల్లికి నానమ్మ కూడా తోడయ్యింది.. అభం శుభం తెలియని ఆ చిన్నారి ఏం చేసిందో ఇద్దరూ కలిసి బిడ్డను బతికుండగానే పాతిపెట్టారు. సోమవారం ఉదయం మూడేళ్ల బాలికను తల్లి, నానమ్మ కలిసి పూడ్చిపెట్టారు, అయితే అటుగా వెళుతున్న స్థానికులకు చిన్నారి ఏడుపు వినిపించింది. దాంతో వారు ఆ చిన్నారిని రక్షించి సమాచారం పోలీసులకు తెలియజేశారు.

కొంతమంది మహిళలు స్మశాన వాటిక సమీపంలో కట్టెలు ఏరుకుంటున్నారు. వారికి చిన్న పిల్ల అరుపులు వినిపించేసరికి మొదట భయపడ్డారని. అవి దెయ్యాలేమో అని భ్రమ పడ్డారు. అయినా మరికొంత మంది గ్రామస్థులతో కలిసి శ్మశానవాటిక వద్దక చేరుకున్నారు. అక్కడ పెద్ద సంఖ్యలో గుమిగూడిన జనం చిన్నారి సజీవంగా పాతిపెట్టబడిందని గుర్తించారు.

వారు చిన్నారి ఏడుపు వినిపించిన ప్రాంతంలో మట్టిని తొలగించి చూడగా మూడేళ్ళ పసిబిడ్డ కనిపించింది. పాప నోటిలో అంతా మట్టి ఉంది. దానిని తొలగించి పోలీసుల సహాయంతో చిన్నారిని ఆస్పత్రి తరలించారు. కోపాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. మూడేళ్ల ఆ పాప తన పేరు లాలీ అని, అమ్మానాన్న రాజు శర్మ, రేఖా శర్మ అని చెప్పింది. అయితే తనకు గ్రామం పేరు తెలియదని చెప్పింది.

"అమ్మ, నానమ్మ స్మశానవాటికకు తీసుకువచ్చారని, ఏడుస్తున్నానని, నోటిలో మట్టిని నింపి పాతిపెట్టారని లాలీ వైద్యులకు, పోలీసులకు చెప్పింది. చిన్నారి తల్లిదండ్రులను, గ్రామాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతవరకు చిన్నారిని శిశు సంరక్షణ అధికారుల పర్యవేక్షణలో ఉంచుతామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story