Delhi Gang Rape: ఢిల్లీలో మైనర్‌పై గ్యాంగ్ రేప్.. ముగ్గురి అరెస్ట్..

Delhi Gang Rape: ఢిల్లీలో రేప్ ఘటనలు ఆగడం లేదు. రోజూ ఏదో ఒక చోట, ఎవరో ఒక అమ్మాయిపై అఘాయిత్యం జరుగుతూనే ఉంది. అందులో కొన్ని బయటికి వస్తే.. చాలావరకు రాకుండానే ఉండిపోతున్నాయి. ఇప్పటికే రేప్ క్యాపిటల్‌గా పేరు తెచ్చుకున్న ఢిల్లీలో ఇటీవల మరో మైనర్ బాలికపై రేప్ ఘటన కలకలం సృష్టించింది. తెలిసినవారే కదా అని నమ్మి వెళ్లిన అమ్మాయిపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు.
ఢిల్లీలోని వసంత్ విహార్‌లో ఉండే 16 ఏళ్ల బాలిక.. మహమ్మద్ ఆరీఫ్ (23), మనోజ్ కుమార్ (25), రూపేష్ కుమార్ (35)లతో జులై 6 సాయంత్రం డ్రైవ్‌కు వెళ్లింది. జులై 7న ఉదయం తిరిగి ఇంటికి వచ్చింది. అదే రోజు సాయంత్రం తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. వెంటనే బాలిక తండ్రి పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. పోలీసులు ఆ ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. జులై 6 రాత్రి యువకులతో కలిసి బాలిక మద్యం సేవించింది. అనంతరం ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఇద్దరు యువకులు తనను రేప్ చేశారు. ముందుగా తనకు తెలిసిన యువకుడు తనను ముద్దు పెట్టుకున్నాడని, ఆ తర్వాత ఇద్దరు తనను రేప్ చేశారని బాలిక స్టే్ట్‌మెంట్ ఇచ్చింది. యువకులకు కానీ, బాలికకు కానీ ఎలాంటి గాయాలు లేవని పోలీసులు వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com