Vizianagaram : కెమెరాకు చిక్కిన పులి.. కాకినాడ నుంచి విజయనగరం వరకు..

Vizianagaram : కెమెరాకు చిక్కిన పులి.. కాకినాడ నుంచి విజయనగరం వరకు..
Vizianagaram : విజయనగరం జిల్లాలో పులి సంచారం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది.

Vizianagaram : విజయనగరం జిల్లాలో పులి సంచారం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. మెరకముడిదాం మండలం పులిగుమ్మి గ్రామ రిజర్వ్‌ ఫారెస్ట్‌ వద్ద అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాలు పెట్టారు. పులి వచ్చిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ఆ ఫోటోలు, వీడియోలను డెహ్రాడూన్‌లో ఉన్న వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ టైగర్‌ జోన్‌కి పంపించారు.

కాకినాడ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి.. ఈ పులి ఒకటేనేమోనన్న అనుమానంతో నిర్ధారణ కోసం పంపించినట్లు జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేష్‌ తెలిపారు. రెండు రోజుల క్రితం ఆవుని వేటాడి తీసుకెళ్తుండగా దృశ్యాలు రికార్డయ్యాయన్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దండోరా వేయించారు.

Tags

Read MoreRead Less
Next Story