గుంటూరులో ట్రాక్టర్‌ బోల్తా.. అక్కడికక్కడే ఆరుగురు మృతి

గుంటూరులో ట్రాక్టర్‌ బోల్తా.. అక్కడికక్కడే ఆరుగురు మృతి
ఘోర ప్రమాదాలతో గుంటూరు జిల్లాలో రహదారులు రక్తమోడుతున్నాయి. వట్టిచెరుకూరు సమీపంలో ట్రాక్టర్‌ బోల్తాపడిన ఘటనలో ఆరుగురు

ఘోర ప్రమాదాలతో గుంటూరు జిల్లాలో రహదారులు రక్తమోడుతున్నాయి. వట్టిచెరుకూరు సమీపంలో ట్రాక్టర్‌ బోల్తాపడిన ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు.. మరికొందరికి తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.. జూపూడిలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.. మృతులు కొండేపాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.. ప్రమాదం విషయం తెలియగానే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.. పోలీసులు ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నారు.

అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో 40 మంది వరకు ఉన్నట్లు చెబుతున్నారు.. అతివేగంతో వస్తున్న ట్రాక్టర్‌ ఒక్కసారిగా పంట కాల్వలోకి దూసుకెళ్లడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రత్యక్ష సాక్షులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. క్షతగాత్రులకు గుంటూరు గవర్నమెంట్‌ జనరల్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక స్పాట్‌లో ముగ్గురు మృతిచెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు చనిపోయారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story