Train : తాగుబోతు టీటీఈ... మహిళపై మూత్రవిసర్జన చేశాడు

Train : తాగుబోతు టీటీఈ... మహిళపై మూత్రవిసర్జన చేశాడు
మహిళ అరుపుల విన్న తోటి ప్రయాణికులు మద్యం మత్తులో ఉన్న టీటీఈని పట్టుకుని సీటుకు కట్టేశారు.


తాగుబోతుల వికృత చేష్టలు శృతిమించుతున్నాయి. విమానంలోనైనా, రైలులోనైనా. విచక్షణ లేకుండా తాగిన మత్తులో ప్రయాణికులను ఇబ్బందులు పెడుతున్నారు. తాజాగా అమృత్ సర్ నుంచి కోల్ కతా వెళ్తున్న రైలులో ఓ ట్రివెల్ టికెట్ ఎక్జామినర్ ( టికెట్ చెకర్ ) తాగిన మత్తులో ఓ మహిళపై మూత్ర విసర్జన చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

అమృత్ సర్ కు చెందిన ఓ మహిళ తన భర్త రాజేష్ కుమార్ తో కలిసి రైలులో ప్రయాణిస్తోంది. అమృత్ సర్ నుంచి కోల్ కతా వెళ్తున్న అకల్ తఖ్త్ ఎక్స్ ప్రెస్ ఏ1 కోచ్ లో ప్రయాణిస్తుండగా.. ఆదివారం అర్ధరాత్రి టికెట్ చెకర్ మున్నా కుమార్ మహిళపై మూత్ర విసర్జన చేశాడు. విషయాన్ని గమనించిన సదరు మహిళ, ఆమె భర్త టికెట్ చెకర్ మున్నా కుమార్ తో గొడవకు దిగారు. మహిళ అరుపుల విన్న తోటి ప్రయాణికులు మద్యం మత్తులో ఉన్న టీటీఈని పట్టుకుని సీటుకు కట్టేశారు. రైలు సోమవారం లక్నోలోని చార్ బాగ్ రైల్వే స్టేషన్ కు చేరుకోగానే టీటీఈని రైల్వే పోలీసులకు అప్పగించారు. టీటీఈని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు పోలీసులు.


Tags

Read MoreRead Less
Next Story