TS : మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్

TS : మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్
నిందితుల నుండి రూ.40లక్షల విలువైన 116 కిలోల మత్తు పదార్థాలతోపాటు నాలుగు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు

హానికర మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న, 15మంది ముఠా సభ్యులను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు, మలక్ పేట్, కుల్సుమ్ పురా పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పట్టుకున్నారు. నిందితుల నుండి రూ.40లక్షల విలువైన 116 కిలోల మత్తు పదార్థాలతోపాటు నాలుగు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. అల్‌ఫ్రాజాలం సప్లై చేస్తున్న మరో 20మంది ముఠాను పట్టుకున్న పోలీసులు నిందితుల నుండి 20లక్షల విలువైన టాబ్లెట్ల రూపంలో ఉన్న మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీసీపీ చక్రవర్తి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story