అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై కొనసాగుతోన్న విచారణ

వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ కొనసాగుతుంది. తన వాదనలు వినిపిస్తోంది సీబీఐ.మూడు అంశాలపై ప్రధానంగా వాదనలు వినిపిస్తుంది సీబీఐ. ఈనేపధ్యంలో సీబీఐకి పలు ప్రశ్నలు సంధించింది హై కోర్టు.సామాన్యుడు నిందితుడు అయితే ఇంత లేట్‌గా దర్యాప్తు..ఉంటుందా అని ప్రశ్నించిన ధర్మాసనం..హత్యకు రకరకాల కారణాలు ఉన్నాయని అఫిడవిట్‌లో ఉంటే ఒక దానికే ఎలా స్టిక్ అవుతారని ప్రశ్నించింది. అయితే కడప ఎంపీ టికెట్ విజయమ్మ లేదా షర్మిలకు ఇవ్వాలని వివేకా అడిగారని,వివేకాపై రాజకీయంగా పై చేయి సాధించాలని అవినాష్ భావించారని అందుకే గంగిరెడ్డి ద్వారా అవినాష్ కుట్ర చేశారని సీబీఐ కోర్టు తెలిపింది. అయితే రాజకీయంగా అవినాష్ బలవంతుడని సీబీఐ అంటోందని వివేకాను చంపాల్సిన అవసరమేంటని సీబీఐని ప్రశ్నించింది ధర్మాసనం.భాస్కర్ రెడ్డి, ఉదయ్ అరెస్ట్ కు కారణాలేంటని అడిగింది హైకోర్టు.
బీఐ.విచారణకు అవినాష్ సహకరించడంలేదని..ఎప్పుడు నోటీస్ ఇచ్చినా 3,4 రోజులు సమయం అడుగుతూ వస్తున్నాడని తెలిపింది. గత ఏప్రిల్17,మే15న నోటీసిలు ఇస్తే కోర్టుల చుట్టూ తిరిగి పిటిషన్‌లు వేశారని కోర్టుకు తెలిపింది.మిగతా ఆరు నిందితులు కూడా విచారణకు హాజరైయ్యారని అవినాష్ మాత్రం విచారణకు హాజరు కావడం లేదని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com