Tunisha Sharma Suicide: తాను వెళ్లిపోయింది.. అమ్మకే అన్నీ విడిచిపెట్టింది: తునిషా ఆస్తి వివరాలు

Tunisha Sharma Suicide: ముంబైలో 15 కోట్ల ఆస్తిని సంపాదించిన తునీషా శర్మ.. తన తల్లికే స్వంతం
తునిషా శర్మ ఇంకా అందరి కళ్లల్లోనూ మెదులుతూనే ఉంది. ఆమె ఇక లేదు అన్న నిజాన్ని జీర్ణించుకునేందుకు అభిమానులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఆమె సంపాదించిన ఆస్తులపై బయటకు వచ్చిన వివరాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 13వ ఏట నుంచే టీవీ సీరియల్స్ లోను, చిత్రాల్లోనూ, యాడ్స్ లోను నటిస్తూ వచ్చింది తునీషా. అలా తను సంపాదించిన ఆస్ధి సుమారు రూ. 15 కోట్ల రూపాయలు ఉండవచ్చన తెలుస్తోంది. ఇక తునీషా మరణానంతం ఆమె సంపాదించిన ఆ ఆస్ధి మొత్తం ఆమె తల్లి వనితా శర్మకు దక్కుతుందని అధికారులు నిర్ధారించారు.
ఇక తునీషా మరణం ఇండస్ట్రీలో తీరని లోటని తన సహాయ నటులు తెలుపుతున్నారు. నిజానికి తునీషా మరణానికి కాసేపు ముందు కూడా ఎంతో ఆహ్లాదంగా అందరితో గడిపిందని, తన తల్లితో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. సరిగ్గా ఘటన జరిగే 15 నిమిషాల ముందు తునీషా తన ప్రియుడు షీజాన్ ఖాన్ తో చాట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఫోన్ కాల్ అనంతరం తునీషా ఆత్మహత్యకు పాల్పడిందని, వీరి మధ్య ఏం జరిగిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
తునీషా తల్లి వనితా శర్మ తన కుమార్తె మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. తన కుమార్తె మృతికి షీజాన్ ఖానే కారణమని, తునీషా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తునీషాను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడని వనితా ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు షీజాన్ ఖాన్ ను డిసెంబర్ 30వ వరకు పోలీసుల కస్టడీలో ఉంచారు.
అసలు తునీషా ఆత్మహత్యకు బ్రేకప్ కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సూసైడ్ చేసుకోవడానికి పదిహేను రోజుల క్రితమే షీజాన్ ఖానే- తునిషా కి బ్రేకప్ చెప్పాడట. అంతేకాకుండా మరో ట్విస్ట్ ఏమిటంటే.. షీజాన్ సీక్రెట్ గా వాట్స్ లో మరో అమ్మాయితో మాట్లాడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో సీక్రెట్ ప్రియురాలి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. ఆమెకు, తునిషాకి మధ్య ఏవైనా సంభాషణలు జరిగాయా? లేదా? అన్నది మిస్టరీగా మారింది.Tunisha Sharma Death:తన తల్లి కోసం రూ. 15 కోట్ల ఆస్తిని సంపాదించిన తునీషా శర్మ
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com