ఎడబాటు తప్పదని.. కలిసికట్టుగా ఆత్మహత్య..!

ఎడబాటు తప్పదని..  కలిసికట్టుగా ఆత్మహత్య..!
వారిద్దరూ కవలలు.. చిన్నప్పటి నుంచి ఒకేచోట ఆడుతూపాడుతూ పెరిగారు. జీవితాంతం అలాగే ఉండాలని అనుకున్నారు.

వారిద్దరూ కవలలు.. చిన్నప్పటి నుంచి ఒకేచోట ఆడుతూపాడుతూ పెరిగారు. జీవితాంతం అలాగే ఉండాలని అనుకున్నారు. కానీ వారి తల్లిదండ్రులు మాత్రం వారిని వేర్వేరు కుటుంబాల వారికి ఇచ్చి పెళ్లి చేయాలనీ అనుకున్నారు. దీనితో ఎడబాటు తప్పదని వారిద్దరూ భావించారు. బ్రతికి దూరంగా ఉండలేక.. కలిసికట్టుగా చనిపోవాలని అనుకున్నారు. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకొని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లా శ్రీరంగపట్టణ తాలూకా హణసనహళ్లిలో చోటుచేసుకుంది. సోమవారం వెలుగు చూసిన ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతులను దీపిక, దివ్య(19)లుగా గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story