Hyderabad: అక్కను వేధిస్తున్నాడని బావపై బావమరుదుల స్కెచ్.. చివరికి..

Hyderabad: అక్కను వేధిస్తున్నాడని బావపై బావమరుదుల స్కెచ్.. చివరికి..
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది.

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. అక్కను వేధిస్తున్నాడని.. బావను హత్య చేశారు ఇద్దరు బావమరుదులు. ఈ ఘటన జీడిమెట్ల పీఎస్‌ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో జరిగింది. వెంకటేశ్.. తరచూ తన అక్కతో గొడవపడుతున్నాడనే కోపంతో వినయ్‌, మధు.. నిన్న రాత్రి దారి కాచి కత్తులతో దాడి చేశారు. అడ్డు వచ్చిన వెంకటేశ్‌ స్నేహితులు పోతరాజు, కృష్ణను కత్తులతో పొడిచారు. దీంతో తీవ్ర రక్తస్రావంతో వెంకటేశ్‌, పోతరాజు మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన కృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికుల సమచారంతో నిందితులు వినయ్‌, మధును అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story