మాదాపూర్‌లో భారీ పేలుడు

X
By - Subba Reddy |12 Jun 2023 6:15 PM IST
సాయినగర్ కాలనీలోని ఓ హోటల్‌లో రెండు సిలిండర్లు బ్లాస్ట్ అయ్యాయి
హైదరాబాద్ మాదాపూర్‌లో భారీ పేలుడు సంభవించింది. సాయినగర్ కాలనీలోని ఓ హోటల్‌లో రెండు సిలిండర్లు బ్లాస్ట్ అయ్యాయి. వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు సిలిండర్లు పేలినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో హోటల్ దగ్ధం కాగా.. సిబ్బంది తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com