Nandyala : ఒకదానితో ఒకటి ఢీకొన్న ఆర్టీసీ బస్సులు..

X
Nandyala : నంద్యాల జిల్లాలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. నంద్యాల కర్నూలు బైపాస్ రోడ్డు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 12మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నంద్యాల నుంచి కూకట్‌పల్లికి వెళ్తున్న నంద్యాల డిపో బస్సును ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు వేగంగా ఢీకొట్టింది. ద్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.
అర్థరాత్రి వేళ ప్రమాదం జరగడంతో రెండు బస్సుల్లోని ప్రయాణికులు నడిరోడ్డుపై తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి వేరే బస్సుల్లో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు తరలించే ఏర్పాట్లు చేశారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
