Nalgonda : నల్లగొండలో దారుణం.. ఇద్దరు మహిళలకు శిరోముండనం..

Nalgonda : నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం రామగుండ్ల తండాలో దారుణం జరిగింది. ఇద్దరు మహిళలకు గ్రామపెద్దలు.. సర్పంచ్, గ్రామస్తుల సమక్షంలోనే శిరోముండనం చేయించారు. ఈనెల 13న దేవరకొండలోని మోడల్ స్కూల్‌లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న 16 ఏళ్ల రామావత్ రాజుకుమార్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. యువకుడి మరణంపై ఆరా తీసిన గ్రామపెద్దలు.. రాజుకుమార్‌తో ఇద్దరు మహిళల అక్రమ సంబంధం బయటపడిందన్నారు.
రాజుకుమార్ ఫోన్ రికార్డింగ్‌ని పరిశీలించిన గ్రామస్తులు.. సదరు ఇద్దరు మహిళలే రాజుకుమార్‌ను చంపేశారంటూ అనుమానించారు. దాంతో గ్రామపెద్దలు.. అందరూ చూస్తుండగానే మహిళలకు గుండు కొట్టించారు. బాధితురాలు కమ్లి పోలీసులకు ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అటు రామగుండ్ల తండాలో జరిగిన దారుణ ఘటనను సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఖండించారు. ఇద్దరు మహిళలను గుండు కొట్టించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com