Kakinada : కాకినాడ షుగర్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి..

Kakinada : కాకినాడ షుగర్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి..
X
Kakinada : కాకినాడ రూరల్ వాకలపూడిలోని ప్యారి షుగర్ ఫ్యాక్టరీలో ప్రమాదంపై కలెక్టర్ కృతికా శుక్లా సీరియస్ అయ్యారు.

Kakinada : కాకినాడ రూరల్ వాకలపూడిలోని ప్యారి షుగర్ ఫ్యాక్టరీలో ప్రమాదంపై కలెక్టర్ కృతికా శుక్లా సీరియస్ అయ్యారు. బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రమాదంపై కమిటీ వేస్తామన్న కలెక్టర్.. అవసరమైతే నివేదిక ఆధారంగా ఫ్యాక్టరీని మూసివేస్తామని తెలిపారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కృతికా శుక్లా స్పష్టంచేశారు.

అటు ప్యారి షుగర్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మరణించిన మృతులు, గాయపడిన కుటుంబాలను టీడీపీ, జనసేన నేతలు పరామర్శించారు. అధికార యంత్రాంగం, ఫ్యాక్టరీ యాజమాన్యంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వీవీఎస్ వర్మ మండిపడ్డారు. విశాఖ ఎల్జీ పాలీమర్స్ తరహాలోనే మృతుల కుటుంబాలకు కోటి 50 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. అలాగే ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్న జనసేన నేత పంతం నానాజీ.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కోర్టులను ఆశ్రయిస్తామన్నారు.

కాకినాడ రూరల్ వాకలపూడిలోని ప్యారి షుగర్ ఫ్యాక్టరీలో మరోసారి పేలుడు సంభవించడం కలకలం రేపింది. పరిశ్రమలోని మిషనరీ ఎక్విప్‌మెంట్ సెక్షన్‌లో బాయిలర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన కాకినాడ అపోలో ఆస్పత్రికి తరలించారు. మృతులు గొల్లప్రోలుకు చెందిన రాగం ప్రసాద్.. కె.గంగవరంకు చెందిన పేరురి సుబ్రహ్మణ్యస్వరరావుగా గుర్తించారు. 10 రోజుల వ్యవధిలో ప్యారి షుగర్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరగడం ఇది రెండోసారి. ఈనెల 19న జరిగిన పేలుడులో మృతి చెందిన ఇద్దరు కార్మికులు చెందారు. ఈ ఘటన మరవక ముందే మరోసారి ఇదే ప్యారి షుగర్ ఫ్యాక్టరీలో పేలుడు జరగడంతో స్థానికులు, కార్మికులు భయాందోళనలు చెందుతున్నారు.

Tags

Next Story