UP : గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ పిటిషన్ ను కోట్టేసిన సుప్రీంకోర్టు

ఉత్తరప్రదేశ్ అంటేనే గ్యాంగ్ స్టర్లు భయపడుతున్నారు. తమ ప్రాణాలు ఎక్కడ పోతాయో అని వణుకుతున్నారు. గతకొంతకాలంగా చాలా మంది గ్యాంగ్ స్టర్లు పోలీసుల ఎన్ కౌంటర్లో హతమవడమే అందుకు కారణమని తెలుస్తోంది. తాజాగా... గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్, తనను ఉత్తరప్రదేశ్ జైలులో ఉంచవద్దని గుజరాత్ లోని జైలుకు తరలించాలని సుప్రీంకోర్టులో పిటీషన్ వేశాడు. ఆయన పిటీషన్ ను న్యాయస్థానం కొట్టేసింది. అతిక్ ప్రస్తుతం ప్రభుత్వ అధికారుల రక్షణలో ఉన్నాడని వాళ్లు అతన్ని సురక్షితంగా చూసుకోగలరని పేర్కొంది.
ఉమేష్ పాల్ హత్య కేసులో తనను, తన కుటుంబాన్ని ఇరికించారని, ప్రయాగ్ రాజ్ కు తీసుకెళ్తే యూపీ పోలీసులు ఫేక్ ఎన్ కౌంటర్ చేస్తారని పేర్కొంటూ అతిక్ అహ్మద్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే... అహ్మదాబాద్ సబర్మతీ జైలునుంచి అతిక్ ను సురక్షితంగా తీసుకువచ్చారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. నిందితుడి తరపు న్యాయవాదులు మాట్లాడుతూ.. అతిక్ ను పోలీసులు బెదిరించారని అతనికి కోర్టు రక్షణ కల్పించాలని తమ వాదనలు వినిపించారు.ఇది సుప్రీంలో కాదని హైకోర్టుకు వెళ్లండని న్యాయస్థానం స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com