వైద్యుల నిర్లక్ష్యం.. తప్పు ఇంజెక్షన్ ఇవ్వడంతో మృతి చెందిన బాలిక

వైద్యుల నిర్లక్ష్యం.. తప్పు ఇంజెక్షన్ ఇవ్వడంతో మృతి చెందిన బాలిక
ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా 17 ఏళ్ల బాలిక మృతి చెందింది.

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా 17 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఆసుపత్రి సిబ్బంది ఆమె మృతదేహాన్ని బయట పార్క్ చేసిన మోటార్‌సైకిల్‌పై పడేసి, ఆమె చనిపోయిందని కూడా తమకు తెలియజేయకుండా అక్కడి నుంచి పారిపోయారని బాధితురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

ప్రజల ఆగ్రహానికి భయపడి వైద్యుడు మరియు ఆసుపత్రి సిబ్బంది అందరూ పారిపోయారు. దీంతో బాలిక కుటుంబం ఆస్పత్రి ముందు బైఠాయించి న్యాయం కోరుతోంది. ఆస్పత్రి వెలుపల మోటార్‌సైకిల్‌పై విగతజీవిగా పడి ఉన్న బాలిక వీడియో వైరల్‌గా మారింది.

బాధితురాలు భారతికి మంగళవారం జ్వరం రావడంతో ఘిరోర్ ప్రాంతంలోని కర్హల్ రోడ్‌లో ఉన్న రాధా స్వామి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆమె అత్త మనీషా బుధవారం "బాగానే ఉంది" అని తెలిపారు. ఆ తర్వాత డాక్టర్ ఆమెకు ఇంజక్షన్ ఇచ్చారని, ఆ తర్వాత ఆమె పరిస్థితి విషమించిందని తెలిపింది. దీంతో భారతి పరిస్థితి విషమించడంతో వేరే ఆసుపత్రికి తీసుకెళ్లమని డాక్టర్ చెప్పారని, తాము ఏమీ చేయలేమని అన్నారు.

అయితే అప్పటికే భారతి చనిపోయిన విషయాన్ని కప్పి ఉంచారు. వైద్యుడిని గట్టిగా నిలదీయడంతో భారతి డెడ్ బాడీని మోటార్ సైకిల్ పై పడేసి వైద్యుడు, సిబ్బంది పారిపోయారు. బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story