Brother Killed Sister : సోదరి తల నరికి...

Brother Killed Sister : సోదరి తల నరికి...
ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన పరువు హత్య... సోదరి తల నరికి రోడ్లపై తిరిగిన సోదరుడు... నిందితుడి అరెస్ట్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో పరువు హత్య సంచలనం సృష్టించింది. సోదరి వేరే వ్యక్తితో పారిపోయిందని కక్షగట్టిన నిందితుడు.. ఆమె తల నరికేశాడు(UP Man Beheads Sister). అనంతరం ఆ తలతో రోడ్డుపై తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటనతో ఉత్తర్‌ ప్రదేశ్‌లో మరోసారి ఉ‌ద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. Brother Killed Sister : సోదరి తల నరికి...ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాకు చెందిన వ్యక్తి సొంత సోదరినే దారుణంగా హత్య చేశాడు. పదునైన ఆయుధంతో ఆమె తల(severed head of his sister)ను నరికాడు. అనంతరం ఓ చేతిలో తల, మరో చేతిలో కత్తితో.. నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాడు. నిందితుడు లొంగిపోయేందుకు పోలీస్‌స్టేషన్‌ వైపు వెళుతుండగా‍(Walks To Police Station).. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు మార్గమధ్యలోనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.


ఫతేపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిత్వారా గ్రామం(Mithwara village)లో ఈ దారుణం జరిగింది. నిందితుడ్ని రియాజ్‌(Riyaz), బాధితురాలిని అసిఫాగా పోలీసులు గుర్తించారు. శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రియాజ్‌ కాసేపటికి తిరిగొచ్చాడు. అనంతరం అసిఫాను బట్టలు ఉతకమని చెప్పాడు. దీంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లి బాధితురాలు బట్టలు ఉతికేందుకు సిద్ధమవుతుండగా.. ఒక్కసారిగా పదునైన ఆయుధం( a sharp weapon)తో వెనుకనుంచి ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె తల తెగి(behead his sister) కింద పడింది. అనంతరం తలను తీసుకుని నడిరోడ్డుపై నడుచుకుంటూ పోలీస్‌ స్టేషన్‌ వైపు వెళ్లాడు.

ఒక చేతిలో సోదరి తలను.. మరో చేతిలో ఆయుధంతో నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న రియాజ్‌ను చూసి.. స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడి నుంచి యువతి తలను, ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పథకం ప్రకారమే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్న కారణంగా.. బాధితురాలిని కావాలనే బయటకు రప్పించి.. హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మే 25న అదే గ్రామానికి చెందిన యువకుడితో అసిఫా పారిపోయింది. అనంతరం ఐదుగురు వ్యక్తులపై అసిఫా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు.. అసిఫా జాడను కనుగొని.. ఆమెతో పాటున్న యువకుడిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం అతడు జైలులోనే ఉన్నాడు. అయితే అసిఫా ప్రవర్తన పట్ల తీవ్ర ఆగ్రహానికి గురైన రియాజ్‌ ఆమెను హత్య చేశాడు. రియాజ్‌పై ఇంతకు ముందే పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story