Crime News: దుర్మార్గుడు.. మనవరాలిని అత్యాచారం చేసి ఎవరికీ చెప్పొద్దని రూ.10 ఇచ్చి ..
Crime News: కాటికి కాళ్లు చాపుకున్న వాళ్లు కూడా కామంతో చచ్చిపోతున్నారు.. 15 ఏళ్ల మనవరాలి జీవితాన్ని పాడు చేయడానికి మనసెలా ఒప్పిందో.. రేపో మాపో పోయేవాడు మైనార్టీ కూడా తీరని ఆ బాలికను అత్యాచారం చేసి ఆమె జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు.. ఇలాంటి వాళ్లకు ఎంతటి కఠిన శిక్ష విధించినా తప్పులేదు.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 60 ఏళ్ల వ్యక్తి తన మనవరాలిపై అత్యాచారానికి పాల్పడి అరెస్టయ్యాడు.. నిందితుడు 15 ఏళ్ల బాలికకు రూ.10 ఆఫర్ చేసి, నేరం గురించి ఎవరికీ చెప్పవద్దని అన్నాడు..పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కట్టెలు కొట్టడానికి గొడ్డలిని తీసుకురావాలని పొలంలో ఉన్న తాత మనవరాలిని కోరాడు. బాలిక గొడ్డలితో తిరిగి వచ్చిన తర్వాత, అతను ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెకు రూ.10 ఇచ్చి ఎవరికీ చెప్పవద్దన్నాడు. నీరు తెచ్చేందుకు పొలం పక్కనుంచి వెళ్తున్న ఓ వ్యక్తి జరుగుతున్న విషయాన్ని గమనించి అప్రమత్తం చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న జనం బాలిక తాతయ్యను కొట్టి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com