క్రిస్మస్ బహుమతులపై గొడవ.. సోదరిని కాల్చి చంపిన సోదరుడు

క్రిస్మస్ బహుమతులపై గొడవ.. సోదరిని కాల్చి చంపిన సోదరుడు
వాళ్లంతా ఫ్లోరిడాలోని తమ అమ్మమ్మ ఇంటిలో ఉన్నారు. క్రిస్మస్ కు వచ్చిన బహుమతులన్నీ చూస్తున్నారు.

వాళ్లంతా ఫ్లోరిడాలోని తమ అమ్మమ్మ ఇంటిలో ఉన్నారు. క్రిస్మస్ కు వచ్చిన బహుమతులన్నీ చూస్తున్నారు. వాటి గురించి అక్కా తమ్ముళ్లు గొడవ పడ్డారు. అది కాస్తా పెద్దదవడంతో ఆవేశంతో అక్కను కాల్చి చంపేశాడు. ఇద్దరు పిల్లల తల్లి అబ్రియెల్ బాల్డ్విన్ (23) ఆదివారం మరణించారు. ఈ దుదృష్టకర సంఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. సోదరిని కాల్చి చంపినందుకు పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు.

అబ్రియెల్ బాల్డ్విన్, ఆమె సోదరుడు డమార్కస్ (14), మరో సోదరుడు డార్కస్( 15) అమ్మమ్మ ఇంట్లో ఉన్నారు. వారి తల్లి, అబ్రియెల్ ఆరేళ్ల కొడుకును తీసుకుని క్రిస్మస్ షాపింగ్‌కు వెళ్లింది."

డమార్కస్, డార్కస్ మరియు అబ్రియెల్ క్రిస్మస్ బహుమతుల విషయంలో ముగ్గురూ గొడవ పడ్డారు. "క్రిస్మస్ అయినందున వాదించడం మానేయమని అబ్రియెల్ డమార్కస్‌తో చెప్పిన తర్వాత, డమార్కస్ ఆమెను, ఆమె బేబీ క్యారియర్‌లో పట్టుకున్న 11 నెలల చిన్నారిని కాల్చబోతున్నట్లు అబ్రియెల్‌తో చెప్పాడు". వద్దని ఎంత వారించినా వినలేదు. భయంతో "అబ్రియెల్ క్యారియర్‌లో పడుకున్న పిల్లవాడిని పట్టుకున్నప్పుడు డమార్కస్ అబ్రియెల్‌ను ఛాతీపై కాల్చాడు."

"కొద్దిసేపటి తర్వాత, డార్కస్ మరొక తుపాకీతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. "డార్కస్ తన తుపాకీని సమీపంలోని యార్డ్‌లోకి విసిరి సంఘటన స్థలం నుండి పారిపోయాడు. డమార్కస్‌పై 1వ డిగ్రీ హత్య, తుపాకీని కలిగి ఉన్నందుకు నేరం మోపబడింది. అదే సమయంలో డార్కస్‌పై 1వ డిగ్రీ హత్యకు ప్రయత్నించడం మరియు భౌతిక సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి అభియోగాలు మోపారు. పినెల్లాస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ప్రకారం విచారణ కొనసాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story