స్లీపర్ కోచ్‌లో దారుణం.. నిద్రిస్తున్న15 ఏళ్ల బాలికపై..
ఈ దారుణాలు ఆగేదెన్నడు.. మృగాడు మారెదెప్పుడు.. అమ్మాయి కనిపిస్తే చాలు ఆబగా చూస్తున్నాడు.. కోరిక తీర్చుకోవడమే పనిగా పెట్టుకుంటున్నాడు.. పాపం, పుణ్యం, శిక్షలు ఏవీ గుర్తుకు రావట్లేదు.. అత్యాచారానికి ఒడిగట్టే దుర్మార్గులకి శిక్షలు మరింత కఠినంగా ఉంటే తప్ప మరో మగాడు అలాంటి దుర్మార్గపు ఆలోచన చేయడానిక్కూడా భయపడతాడు..
తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన 15 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. బాలిక సోమవారం రాత్రి 11 గంటలకు బదర్‌పూర్ నుండి ఔరియాకు వెళ్లేందుకు తన కుటుంబంతో కలిసి బస్సు ఎక్కింది. స్లీపర్ కోచ్‌లో తన తల్లి, కుటుంబసభ్యులతో కలిసి ప్రయాణిస్తోంది. అర్థరాత్రి సమయంలో బస్సుకి ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చి ఆగిపోయింది. కుటుంబసభ్యులు కిందికి దిగినా బాలిక బస్సులోనే పై బెర్త్‌లో పడుకుని ఉంది. దీంతో కండక్టర్ సహాయకుడు అషు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
బాలిక తల్లి బస్సు వద్దకు తిరిగి వచ్చినప్పుడు, మైనర్ బాలిక తనపై జరిగిన దారుణాన్ని అమ్మకు వివరించింది. దీంతో తల్లి కండక్టర్ వద్దకు వెళ్లి వాహనాన్ని ఆపమని అడిగింది. కానీ కండక్టర్ బబ్లు ఆమెని వెనక్కి తోసేసాడు. నిందితుడు అషు తాను చేసిన నిర్వాకం బయటపడిందని తెలిసి అలీగఢ్‌లోని టప్పల్ సమీపంలో బస్సు నుంచి కిందకు దిగి పారిపోయాడు. కండక్టర్ బబ్లూ మధురలోని నౌజీల్ ప్రాంతంలో దిగిపోయాడని బాలిక తల్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.
బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, మంగళవారం ఉదయం ఇద్దరు వ్యక్తులపై శికోహాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా, ప్రధాన నిందితుడు అషును అరెస్టు చేశారు. ఇతర నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com