ఆన్‌లైన్‌‎లో పాఠాల కోసం సెల్ ఇస్తే .. పేరెంట్స్ ఖాతాలో లక్ష గోవిందా..!

ఆన్‌లైన్‌‎లో పాఠాల కోసం సెల్ ఇస్తే .. పేరెంట్స్ ఖాతాలో లక్ష గోవిందా..!
X
Uttar Pradesh: కరోనా కారణంగా ఆయా రాష్ట్రాల్లో విద్యా సంస్థలు అన్నీ మూతపడ్డాయి. ఇంటివద్దనుంచే పాఠాలు వినేలా ఆన్‌లైన్‌ పాఠాలు నిర్వహిస్తున్నారు.

Uttar Pradesh: కరోనా కారణంగా ఆయా రాష్ట్రాల్లో విద్యా సంస్థలు అన్నీ మూతపడ్డాయి. ఇంటివద్దనుంచే పాఠాలు వినేలా ఆన్‌లైన్‌ క్లాస్సేస్ నిర్వహిస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌ క్లాసులు కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లల చేతికి "స్మార్ట్ ఫోన్స్" ఇస్తున్నారు. క్లాసులు ముగిసాక కూడా చాలా సమయం పిల్లలు మొబైల్స్ తోనే గడుపుతున్నారు. అలాంటి సమయాల్లో పేరెంట్స్ వారిని పట్టించుకోకపోతే చాల అనర్థాలు జరిగే అవకాశం ఉంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఎదుర్కొన్నారు ఉత్తర ప్రదేశ్‌కి చెందిన ఓ జంట.

ఉత్తర ప్రదేశ్‌ గోండా జిల్లాలోని ఓ గ్రామంలో నివస్తిన్నారు ఈ జంట. వీళ్ళకి 12, 14 వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. స్కూల్స్ తెరుచుకోకపోవడంతో ఇంటివద్దనే ఉంటూ ఫోన్ లో ఆన్‌లైన్‌ క్లాస్ లు వింటున్నారు ఈ పిల్లలు. భర్త పనికోసం బైటికి వెళ్ళగా.. భార్య ఇంట్లో పనులలో నిమగ్నమయ్యేది. ఇదిలా ఉండగా పిల్లు క్లాసు లు ముగిసాక కూడా ఫోన్ లోనే గడుపుతూ సరదాగా ఆన్‌లైన్‌ గేమ్స్ ని ఇంస్టాల్ చేస్కొని ఆడటం మొదలుపెట్టారు ఈ అన్నదమ్ములు. ఈ క్రమంలోనే ఫ్రీ ఫైర్ గేమ్ ఇన్‌స్టాల్‌ చేస్కున్నారు. ఈ గేమ్ లో డైమండ్స్‌, క్యారెక్టర్లకు బట్టలు కొనడం కోసం ఏకంగా లక్ష రుపాయలు ఖర్చు చేసారు ఆ పిల్లలు.

పిల్లల ఆన్‌లైన్‌ ఫీజుల కోసం డబ్బు డ్రా చేయడానికి బ్యాంక్‌కి వెళ్లగా అకౌంట్‌లో డబ్బులు లేవని బ్యాంక్‌ సిబ్బంది చెప్పడంతో కన్నీళ్ల పర్యంతమయ్యాడు ఆ దంపతులు. అసలు విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. గేమ్‌కు సంబంధించి లీగల్‌ ట్రాన్‌జాక్షన్‌ కావడంతో ఏం చేయలేమని చెప్పారు పోలీసులు. ఆ దంపతుల పరస్థితిని అర్థం చేస్కున్న గోండా జిల్లా ఎస్పీ సంతోష్‌ మిశ్రా ఆ పేరెంట్స్‌కి కొంత ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు ఆయన స్థానికంగా ఉండే కొందరు పేరెంట్స్‌ను పిలిపించుకుని స్మార్ట్‌ ఫోన్లలో పిల్లల యాక్టివిటీపై ఒక కన్నేసి ఉంచాలి స్వయంగా ఆయనే కౌన్సెలింగ్‌ ఇస్తున్నాడు.

Tags

Next Story