Vistara : విమానాల్లో వింతచేష్టలు, అర్థనగ్న ప్రదర్శనలు

విమానాల్లో ప్రయాణికుల వికృతచేష్టలు నిత్యకృత్యం అవుతున్నాయి. తాజాగా.. ఇటలీకి చెందిన పావోలా పెరుక్కియా (45) అనే మహిళ అబుదాబి నుంచి ముంబైకు విస్తారాలో ప్రయాణిస్తుంది. ఎకానమీ క్లాస్ టికెట్ కొన్న ఆవిడ బిజినెస్ క్లాస్ లో కూర్చుంటానని విమాన సిబ్బందితో గొడవ పడింది. అర్థనగ్నంగా విమానంలో తిరిగింది. సిబ్బంది ఆమెను వారించగా దాడి చేసింది. తోటి ప్రయాణికుల రక్షణ మేరకు పైలెట్ వార్నింగ్ కాల్ ఇచ్చారు. అయినా ఆవిడ వినిపించుకోలేదు. క్యాబిన్ క్రూను కొట్టి, మరొకరిపై ఉమ్మివేసింది. క్యాబిన్ క్రూ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడానికి ముందు నిందితురాలికి పలు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. తోటి ప్రయాణికులతో పాటు, సిబ్బంది స్టేట్మెంట్ ను రికార్డ్ చేయడానికి అన్ని ఫార్మాట్లను పూర్తిచేసినట్లు చెప్పారు. ఈ మధ్య కొందరు ప్రయాణికులు తోటి ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటుండటంతో విమాన సంస్థలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com