Viveka Murder Case : వివేకా హత్య కేసులో కీలక పరిణామం

వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా కూతురు సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసు దర్యాప్తును పర్యవేక్షించేలా ట్రయల్ కోర్టును ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే దర్యాప్తును జూన్ 30కి పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినందున.. తాము పర్యవేక్షించలేమని సునీత పిటిషన్‌ను ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ట్రయల్ కోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టును సునీత ఆశ్రయించింది. వివేకా హత్య కేసు దర్యాప్తును ట్రయల్ కోర్టు పర్యవేక్షించేందుకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్పష్టత ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరింది. సుప్రీంకోర్టుకు ఈ నెల 29 నుంచి సెలవుల కారణంగా పర్యవేక్షణ ఉండదని సునీత అభిప్రాయపడుతున్నారు. అందుకే కేసు దర్యాప్తును ట్రయల్ కోర్టు పర్యవేక్షించేలా మార్గం సుగమం చేయాలని సునీత ఈ పిటిషన్‌లో కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com