Vivekananda Reddy : వివేకా హత్య కేసులో సంచలనాలు

వివేకా హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. వివేకా హత్య అవినాష్ రెడ్డికి ముందే తెలుసున్న అన్న సీబీఐ….కుట్ర పన్నింది అవినాశ్, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అంటూ ఆరోపణలు చేసింది. వివేకా హత్యలో నేరుగా పాల్గొన్న యాదాటి సునీల్ యాదవ్ బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్‌లో ఎన్నో సంచలన విషయాలను సీబీఐ బయటపెట్టింది. తన విచారణలో భాగంగా తేలిన విషయాలను సీబీఐ ఆ పిటిషన్‌లో వివరించింది. హత్యకు సంబంధించి 40 కోట్లతో డీల్ కుదరడంలో సునీల్ యాదవ్ కీలకంగా వ్యవహరించాడని తెలిపింది.
మరోవైపు వివేకానందరెడ్డిని అవినాష్ రెడ్డి అడ్డు తొలగించుకోవాలని అనుకోవడానికి, తన ఎంపీ సీటుకు అడ్డు రావడమే కారణమని,ఆయన్ను చంపేందుకు A5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తో కలిసి అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కుట్ర పన్నారని,ఆ ప్లానును దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అమలు చేశారని సీబీఐ విచారణలో తేలిందని వార్తలు వస్తున్నాయి. వివేకాతో సన్నిహితంగా ఉంటున్నా ఆయనపై కోపం ఉన్న A1ఎర్ర గంగిరెడ్డి , వివిధ కారణాలతో వివేకాపై ఆగ్రహంగా ఉన్న A2 యాదాటి సునీల్ యాదవ్,డ్రైవర్ షేక్ A4,అప్రూవర్ దస్తగిరి ,ఉమా శంకర్ రెడ్డిలను ప్రత్యక్షంగా హత్యలో పాల్గొనేలా చేశారని సీబీఐ నివేదికలో తెలిపినట్లు సమాచారం.గొడ్డలితో నరకడాన్ని హార్ట్ ఎటాక్ గా చిత్రీకరించడం, బాత్రూంలో జారి పడిపోయారని చెప్పడం, రక్తపు మరకలను క్లీన్ చేయించడంలో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పాత్ర గురించి సీబీఐ గతంలోనే బయటపెట్టింది.
ఇక సీబీఐ కోర్టుకు తెలిపిన రిపోర్ట్ లో వివేకా హత్య రోజు నిందితులందరూ భాస్కర్‌రెడ్డి ఇంట్లోనే ఉన్నారని,వివేకా హత్య విషయం కృష్ణారెడ్డి ద్వారా అవినాష్‌రెడ్డికి ముందే తెలుసని, ఘటనాస్థలంలో సాక్ష్యాలను చెరిపివేయడంలో కూడా అవినాష్‌రెడ్డి పాత్ర ఉందని తెలిపింది. ఈ హత్య కేసులో నిందితులు సునీల్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి..ఉదయం 5:20 నిమిషాలకు భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నారని. వీరి ముగ్గురి ప్రమేయం బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారుని అని సీబీఐ తెలిపింది.ఇక నిందితుడు శివశంకర్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకున్నారని పేర్కొంది. వివేక మృతి విషయాన్ని తెలుసుకొని అవినాష్‌రెడ్డితో పాటు శివశంకర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి, రమణారెడ్డి పీఏ, రాఘవరెడ్డి పీఏ ఘటనా స్థలానికి చేరుకున్నారని, బెడ్రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉన్న వివేకాను చూసి గుండెపోటుతో మరణించారని స్థానిక నేత శశికళకు సమాచారమిచ్చారని సీబీఐ బయటపెట్టింది.
ఆ తర్వాత అవినాష్‌రెడ్డి తన సెల్‌ఫోన్ నుంచి రెండు నెంబర్లకు కాల్ చేసి వివేకా మృతిపై సమాచారం అందించారని సీబీఐ తెలిపింది.దీనికోసం పీఏ రాఘవరెడ్డి ఫోన్ కూడా ఉపయోగించినట్లు గుర్తించారు. వివేకాపై భారీగా రక్తపు మరకలు, గాయాలు క్లియర్‌గా కనిపించినా పోలీసులు ఘటనాస్థలానికి త్వరగా రావాలని సీఐని అవినాష్‌రెడ్డి కోరలేదు. వివేకా గుండెపోటు, తీవ్ర రక్తపు వాంతులు కావడంతోనే సహజంగా మరణించారంటూ డ్రామా క్రియేట్ చేశారని.కుట్రపూరితంగా గుండెపోటు కథనాన్ని అల్లారని కౌంటర్‌లో సీబీఐ తన నివేదికలో తెలిపినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com