వరంగల్‌ తొమ్మిది హత్యల కేసులో నేడు తుది తీర్పు

వరంగల్‌ తొమ్మిది హత్యల కేసులో నేడు తుది తీర్పు
X

వరంగల్‌లో సంచలనం సృష్టించిన తొమ్మిది హత్యల కేసులో కోర్టు నేడు తుది తీర్పు వెలువరించనుంది. నిందితుడికి ఉరి లేదా యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత మే 21న వరంగల్ శివారులోని గొర్రెకుంట సాయి దత్త గన్ని బ్యాగ్స్ కంపెనీలో 9 మందికి నిందితుడు సంజయ్‌కుమార్‌... మత్తిచ్చి సృహ కోల్పోయిన తర్వాత సజీవంగా బావిలో పడేసి హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడు బీహార్‌కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్‌కు సెషన్స్ కోర్టు ఇవాళ శిక్షను ఖరారు చేయనుంది. నిందితుడిపై 7 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసిన పోలీసులు..... నెల రోజుల్లోనే పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

9 మంది మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నారు. మసూద్‌ ఆలం, నిషా ఆలం, భూస్రా ఆలం, మూడు సంవత్సరాల బాబు, శబాబ్‌ ఆలం, సోహిల్‌ ఆలం ఉండగా.. మరో ముగ్గురు డ్రైవర్‌ షకీల్‌, తోటి కార్మికులు శ్రీరాం, శ్యామ్‌లు ఉన్నారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన నిందితుడు సంజయ్‌ కుమార్‌యాదవ్‌ను ఉరి తీయాలని ప్రజలు కోరుతున్నారు.

Tags

Next Story