పెళ్ళి వాహనం బోల్తా.. 30 మందికి తీవ్ర గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం

పెళ్ళి వాహనం బోల్తా.. 30 మందికి తీవ్ర గాయాలు.. ముగ్గురి  పరిస్థితి విషమం
X
సూర్యపేట జిల్లాలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

సూర్యపేట జిల్లాలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అర్వపల్లి మండలం బొల్లంపల్లికి చెందిన శిరీషకు ఉట్కూరుకు చెందిన గణేష్ తో ఇవాళ వివాహం జరగనుంది. ఆ వివాహం కోసం బొల్లంపల్లి నుండి ఓ వాహనంలో30 మంది బంధువులు బయలుదేరారు. వాహనం జగ్గారెడ్డి గూడెం దగ్గర అదుపుతప్పి పల్టీ కొట్టింది. వాహనంలో ఉన్న 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.. క్షతగాత్రులను సూర్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags

Next Story