West Bengal : హౌరాలో ఉద్రిక్త పరిస్థితులు

West Bengal : హౌరాలో ఉద్రిక్త పరిస్థితులు
X

పశ్చిమ బెంగాల్‌ హౌరాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోసారి రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. భారీ పోలీస్‌ బందోబస్తు ఉండగానే రాళ్లతో దాడులు చేసుకున్నారు. కాగా.. నిన్న రాముడి శోభాయాత్రలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆందోళనకారుల్ని చెదరగొట్టిన పోలీసులు బారి కేడ్లు ఏర్పాటు చేయారు. అయితే ఇవాళ ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు భారీ కేడ్లు తొలగించారు. ఇది గమనించిన ఆందోళనకారులు మరోసారి రోడ్లపైకి వచ్చి నానా హంగామా చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులపై టియ్యర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. సీఎం మమతా బెనర్జీ ఎప్పటికప్పుడు పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు.

Next Story