West Bengal : TMC మహిళా కార్యకర్త హత్య

తృణమూల్ కాంగ్రెస్ మహిళా కార్యకర్త హత్యకు గురైంది. మృతురాలిని సుచిత్ర మండల్ గా పోలీసులు గుర్తించారు. పశ్చిమ బెంగాల్ సౌత్ 24 పరగణాస్ జిల్లా కానింగ్ పట్టణంలోని బంగాళా దుంప సాగుచేసే పొలంలో సుచిత్ర మండల్ మృతదేహం లభ్యమైంది. ఈ హత్య శనివారం జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. స్థానికులు పొలం పనులకు వచ్చినప్పుడు సుచిత్రా మండల్ రక్తపు మడుగులో పడి ఉండటం గమనించారు. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా.. ఘటనా స్థలానికి చేరుకుని సుచిత్రను హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే ఆవిడ చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.
సుచిత్ర మెడపైన లోతైన గాయం అయినట్లు పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో సుచిత్రను హత్యచేసినట్లు తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com