రాజ్ కుంద్రా.. బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ మామూలుగా లేదుగా..

రాజ్ కుంద్రా.. బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ మామూలుగా లేదుగా..
పట్టుబడితే పరువు పోతుందన్న ఇంగిత జ్ఞానం ఇసుమంతైనా ఉండదు కాబోలు. అయినా అనుకుంటాం కానీ.. మంచి చెడు విచక్షణ ఉంటే ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తారు.

ఛీ ఛీ పేరుకి పెద్ద మనుషులు.. చేసేవి ఇలాంటి పనులు. డబ్బు సంపాదించేందుకు వేరే మార్గాలేవి లేనట్లు ఇలాంటి నీచపు పనులకు దిగజారుతారు. పట్టుబడితే పరువు పోతుందన్న ఇంగిత జ్ఞానం ఇసుమంతైనా ఉండదు కాబోలు. అయినా అనుకుంటాం కానీ.. మంచి చెడు విచక్షణ ఉంటే ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తారు. ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిన ఆయన బిజినెస్‌కి బ్రేకులు పడ్డాయి. పోలీసులు అతడి అక్రమాలకు చెక్ పెట్టారు.

రాజ్ కుంద్రా లండన్‌లో పెద్ద బిజినెస్ మ్యాన్.. 2009లో నటి శిల్పాశెట్టిని వివాహం చేసుకుని వార్తల్లోకి వచ్చారు. తర్వాత ఐపీఎల్ ప్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్‌లో పెట్టుబడులు పెట్టారు. 2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంతో కుంద్రా చీకట్లో సాగిస్తున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.

2018లో బిట్‌కాయిన్ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కుంద్రాను ప్రశ్నించింది. రియల్ ఎస్టేట్ కుంభకోణంలో దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఇక్బాల్ మిర్చితో సంబంధాలు అతడి బిజినెస్‌కి మరింత బలం చేకూర్చాయి.

రాజ్ కుంద్రాను అరెస్ట్త్‌ చేసిన పోలీసులకు వారి దర్యాప్తులో రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి పోర్న్ షోలను నిర్మించిన వారిని పట్టుకోవడం, మరొకటి క్లిప్‌లను ప్రసారం చేసే వారిపై దృష్టి పెట్టడం. నటుడు, వ్యాపారవేత్త శిల్పా శెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

కుంద్రా ఇలాంటి కేసులను ఇంతకు ముందు ఎదుర్కున్నారా.. అయినా ఈ వ్యవహారం ఇంతవరకు వెలుగు చూడకపోవడానికి కారణం ఏమిటి అని ఇండస్ట్రీలోని పెద్దలు ఆశ్చర్యపోతున్నారు.

రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన కేసు ఏమిటి?

ఈ ఏడాది ఫిబ్రవరి 4 న మహిళలను బలవంతంగా పోర్న్ సినిమాల్లో నటించమని ఒత్తిడి చేసినందుకు ఐదుగురిని అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ముంబైకి వచ్చిన ఈ ఔత్సాహిక నటీమణులు, వెబ్ సిరీస్ పాత్రల పోషిస్తున్న వారిని టార్గెట్‌గా చేసుకునేవారు. ముందు వారికి మామూలు స్క్రిప్ట్ వివరించేవారు. తీరా షూట్ చేసే సమయానికి ఫోర్న్ వీడియోల్లో నటించమని ఒత్తిడి చేసేవారు.

షూట్ చేసే రోజున, స్క్రిప్ట్ మార్చి ఒంటి మీద దుస్తులు లేకుండా నటించమని సదరు మహిళలను బెదిరించేవారు. మహిళలు నిరాకరిస్తే, షూటింగ్ సన్నాహాల కోసం ఖర్చు పెట్టిన బిల్లును చెల్లించమని కోరేవారు. వారి దగ్గర డబ్బులు లేవంటే.. చచ్చినట్లు వారు చెప్పినట్లు చేయాల్సి వచ్చేది.

వీడియోలు చిత్రీకరించిన తర్వాత, నిందితులు వాటిని మొబైల్లో ఉంచేవారు.

ఈ సినిమాలు ఎలా, ఎక్కడ చిత్రీకరించబడ్డాయి?

పోలీసుల కథనం ప్రకారం, ఇది సాధారణంగా ముంబై శివార్లలోని మాద్ ద్వీపంలోని అద్దె బంగ్లాలో పగటిపూట షూట్ జరిపేవారు. డైరెక్టర్లు, డైలాగ్ రైటర్స్, లొకేషన్స్ స్కౌటర్స్ మరియు వెబ్ యాప్ డెవలపర్లు ఇలా మొత్తం ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు కనీస సిబ్బంది ఉంటారు. లాక్డౌన్ సమయంలో ఈ యాప్స్ అన్నీ ప్రాచుర్యం పొందాయి. కొన్ని లక్షల మంది ఈ యాప్స్‌కు సబ్‌స్క్రైబర్లుగా ఉన్నారని పోలీసులు తెలిపారు.

ఈ ప్రొడక్షన్ హౌస్‌లలో కొన్ని దేశం వెలుపల సర్వర్‌ల నుండి ప్రసారం చేయబడతాయి. అటువంటి కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తున్నట్లు గుర్తించిన అటువంటి UK ప్రొడక్షన్ హౌస్ పోలీసు స్కానర్ పరిధిలోకి వచ్చింది. దీంతో దాని ఎగ్జిక్యూటివ్ ఉమేష్ కామత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

కుంద్రాపై ఇలాంటి ఇతర కేసులు ఏమైనా పెండింగ్‌లో ఉన్నాయా?

గత ఏడాది మహారాష్ట్ర సైబర్ పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి కుంద్రా గత నెలలో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ సందర్భంలో కూడా, సైబర్ పోలీసులు వివిధ వేదికలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వచ్చే వారం బెయిల్ దరఖాస్తుపై కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అవును.. అందరికీ ఒకటే అనుమానం.. ఆయన ఇన్ని అక్రమాలు చేస్తుంటే ఆమె ఏం చేస్తున్నట్లు.. అని కుంద్రా భార్య శిల్పా శెట్టి గురించి నెటిజన్లకు డౌట్ వస్తోంది. ఆమె చక్కగా ఆరోగ్యము, ఆహారము అంటూ యోగా చేసుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తుంది.. ఈయనేమో ఫోర్న్ షూట్‌లు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.. ఎవరి బిజినెస్ వారిదేనా ఏంటి.. ఏమో మరి.

Tags

Read MoreRead Less
Next Story